విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి

విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి

అన్నమయ్య: పుల్లంపేట మండల పరిధిలోని రాజుగారిపల్లికి చెందిన విద్యార్థిని మానస(17) విద్యుత్ షాక్‌తో దుర్మరణం చెందింది. ఆ బాలిక ఇంటర్మీడియట్ చదువుతుండేది. ఆదివారం ఇంట్లో స్విచ్ ఆన్ చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మానస మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.