ఏఎంసీ పాలకవర్గ సమావేశం

ఏఎంసీ పాలకవర్గ సమావేశం

ప్రకాశం: కొండపి మార్కెట్ యార్డ్ కమిటీ పాలకవర్గ సమావేశం బుధవారం సింగరాయకొండ ఏఎంసి కార్యాలయంలో జరిగింది. సాధారణ సమావేశం పాలకవర్గ సభ్యులతో ఛైర్మన్ తిరుపతమ్మ అధ్యక్షతన జరిగింది. మూలగుంటపాడులో మంజూరైన రైతు బజార్ స్థల సేకరణలో భాగంగా స్థలంను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ యాప్ కమిటీ ఏవో, సభ్యులు టీడీపీ నాయకుడు కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.