నేడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

HNK: ఆత్మకూరు మండల కేంద్రంలోని జి ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్లో నేడు ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. రెండు మండలాల పరిధిలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరు కావలసిందిగా ఆహ్వానించారు.