VIDEO: సురభి గోశాలను సందర్శించిన కంచి కామకోటి పీఠాధిపతి
KRNL: ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో వెలసిన శైవ పుణ్యక్షేత్రమైన బుగ్గ రామేశ్వర స్వామి ఆలయ సమీపంలోని సురభి గోశాలను కంచి కామకోటి పీఠాధిపతి శనివారం రాత్రి సందర్శించారు. సురభి గోశాల ట్రస్ట్ సభ్యులు సుజాతశర్మ, మారుతి శర్మ కంచి కామకోటి పీఠాధిపతికి స్వాగతం పలికి పుష్పమాలలు అందజేశారు. అనంతరం పీఠాధిపతి గోవులకు ఆహారం తినిపించారు.