సీసీ రోడ్డు పనుల ప్రారంభం

సీసీ రోడ్డు పనుల ప్రారంభం

ASR: హుకుంపేట మండలం రాప పంచాయితీ పరిధిలోని కోటగరువు గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు ఆదివారం ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ పనులు చేపడుతున్నట్లు ఎంపీటీసీ కోరాబు నాగలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజుబాబు, వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.