జలమండలిలో 14 మంది ఉద్యోగులు పదవీ విరమణ
HYD: జలమండలిలో 14 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. బోర్డులో వివిధ స్థాయిల్లో పని చేస్తూ రిటైర్ అయిన వారిని HYDలోని ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. పదవీ విరమణ ద్వారా లభించే గ్రాట్యూటీ వంటి తదితర ప్రయోజనాల్ని చెక్కు రూపంలో అందజేశారు.