జిల్లాలో ప్రత్యేక తనిఖీలు చేసిన పోలీసులు
BDK: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాల నాకాబందీ నిర్వహించారు. రాత్రి తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, పాత నేరస్తులను గుర్తించడానికి ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా పరిశీలనలు చేపట్టారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.