పారిశుధ్య, అభివృద్ధిపై కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
BPT: పట్టణంలో జరుగుతున్న పారిశుధ్య, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని లక్ష్యంగా జిల్లా పురపాలక సంఘం కమిషనర్ జి.రఘునాధ రెడ్డి ఇవాళ ఉదయం పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. రధం బజార్‌లోని యాక్సిస్ బ్యాంక్ రోడ్డులో జరుగుతున్న డ్రెయినేజ్ పూడిక పనులను ఆయన పరిశీలించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు ఆయన సూచించారు.