గణేష్ ఉత్సవాలకు రాత్రి పది తర్వాత నిషేధాజ్ఞలు

గణేష్ ఉత్సవాలకు రాత్రి పది తర్వాత నిషేధాజ్ఞలు

కృష్ణా: బందరు తాలూకా, రాబర్ట్‌సన్‌పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో గణేష్ విగ్రహాలు పెట్టే వారు కమిటీలు ఏర్పరుచుకోవాలని సీఐ యేసు బాబు సూచించారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్/యజమాని అనుమతి, డీఎస్పీ అనుమతి లేకుండా మైకులు, డీజేలు వాడకూడదని హెచ్చరించారు. రాత్రి 10 గంటల తర్వాత కార్యక్రమాలు నిషేధమని పేర్కొన్నారు