VIDEO: నెల్లూరులో కమిషనర్ నందన్ ఆకస్మిక తనిఖీ
NLR: 18వ డివిజన్ హరనాథపురంలో నగరపాలక సంస్థ కమిషనర్ వై.వో. నందన్ మంగళవారం పర్యటించారు. పారిశుధ్య పనులను, డ్రైనేజీ పూడికతీతను పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తి, ఖాళీ స్థలం, కుళాయి పన్నులను 100% వసూలు చేయాలని, నూతన భవన నిర్మాణాలు తప్పనిసరిగా ముందస్తు అనుమతులతోనే జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.