నేడు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహణ

SKLM: మేడే వారోత్సవాలలో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరుగుతుందని జూనియర్ సివిల్ జడ్జి ఎస్ వాణి తెలిపారు. సోమవారం నరసన్నపేట కోర్టులో ఆమె మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరు అవగాహన పరుచుకోవాలని ఆమె సూచించారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.