రేపు కాణిపాకంలో తమిళ ఉగాది వేడుకలు
CTR: కాణిపాకంలో తమిళ ఉగాది వేడుకలు జరగనున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. తమిళ ఉగాది సందర్భంగా ఈ నెల 13వ తేదీన కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. స్వామివారికి కళ్యాణోత్సవం, గణపతి హోమం, ఉంజల్ సేవ, ఏకాంత సేవలు జరగనున్నాయి. అలాగే రాత్రి స్వామివారికి గ్రామోత్సవం జరుగుతుందని తెలిపారు.