ధర్మారంలో ఓట్ల లెక్కింపులో తీవ్ర ఉద్రిక్తత
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారంలో సర్పంచ్ ఓట్ల లెక్కింపులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కౌంటింగ్ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. క్రమంగా పెరిగి, రెండు వర్గాల మధ్య పరస్పర దాడికి దారితీసింది. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనతో ధర్మారంలో రాజకీయం వేడెక్కింది.