రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు మృతి
ప్రకాశం జిల్లా సంతనూతలపాడులోని పేర్నమిట్ట పాలకేంద్రం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. సెక్యూరిటీ గార్డు వేల్పులూరి బాల పీరయ్యను లారీ ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతడు మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.