బోదాపురం శివారులో క్షుద్ర పూజల కలకలం
MLG: వెంకటాపురం మండలం బోదాపురం శివారులో ప్రధాన రహదారి పక్కన క్షుద్ర పూజల ఆనవాళ్లు బయటపడడంతో కలకలం రేగింది. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొత్త వస్త్రాలు, బొమ్మలు కనిపించాయి. గుప్తనిధుల కోసం కొందరు పూజలు నిర్వహించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.