రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ

RR: చేవెళ్ల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి అధికారులు, రైతుల నుంచి సలహాలు, సూచనలు సేకరించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.