'ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి'

'ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి'

SDPT: సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌లతో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారికి సత్వరమే పరిష్కారాలు చూపాలని ఆదేశించారు.