'మండల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది'

ASF: తిర్యాణి మండల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జువ్వాజి అనిల్ గౌడ్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ.. త్రి ఇంక్లైన్ నుండి తిర్యాణి వరకు రోడ్డు మరమ్మతుల కొరకు పది లక్షలు మంజూరైనట్లు పేర్కొన్నారు. మండల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని నిధులు మంజూరు చేస్తుందన్నారు.