VIDEO: రోడ్డు ప్రమాదంలో 30 గొర్రెలు మృతి
KRNL: గూడూరు మండలం పెంచికలపాడు విశ్వ భారతి హాస్పిటల్ వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందున్న గొర్రెలను గమనించని లారీ ఢీకొనడంతో సుమారు 30 గొర్రెలు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల వరకు నష్టం జరిగిందని యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.