గ్యాస్ కోసం పడిగాపులు కాస్తున్న వినియోగదారులు
ఎన్టీఆర్: కంచికచర్లలో ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద శుక్రవారం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ రోజులు గడుస్తున్నా సరఫరా చేయకపోవడంతో వారు గంటల తరబడి వేచి ఉన్నారు. ఏజెన్సీ సిబ్బంది సరైన సమాచారం ఇవ్వడం లేదని, ఫోన్‌కు స్పందించి డెలివరీ సమయం తెలిపితే మంచిదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.