ఆ ప్రచారం నిజం కాదు: జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్

ఆ ప్రచారం నిజం కాదు: జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్

HYD: నగరంలోని పలు సర్కిళ్లలో ఉన్న యాచకులను షెల్టర్ హోమ్సు తరలించడం రెగ్యులర్‌గా జరిగే రొటీన్ కార్యక్రమమని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్(యూసీడీ) చంద్రకాంత్‌రెడ్డి తెలిపారు. నగరంలో జరిగే మిస్ యూనివర్స్ పోటీల సందర్భంగా యాచకులను తరలిస్తున్నారని జరుగుతున్న ప్రచారం నిజం కాదని పేర్కొన్నారు. మూడు నాలుగు నెలలకోసారి యాచకులను షెల్టర్ హోమ్స్‌కు  తరలిస్తామన్నారు.