జేఈఈ మెయిన్స్ లో మెరిసిన అజయ్ కుమార్

జేఈఈ మెయిన్స్ లో మెరిసిన అజయ్ కుమార్

SKLM: ఆమదాలవలస పట్టణంలోని పూజారిపేటకు చెందిన చింతాడ అజయ్ కుమార్ జేఈఈ మెయిన్స్ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచాడు. సోమవారం సాయంత్రం విడుదలైన ఫలితాలలో 99.88 పర్సంటైల్ సాధించి, ఆల్ ఇండియా స్థాయిలో 2009 ర్యాంక్ పొందాడు. అజయ్ ఎల్కేజీ నుంచి పదవ తరగతి వరకు భవిత పాఠశాలలో విద్యను అభ్యసించాడు. అజయ్ విజయంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.