ఇందిరా పాలనలో పేదరికం నుంచి దేశానికి విముక్తి: సోనియా

ఇందిరా పాలనలో పేదరికం నుంచి దేశానికి విముక్తి: సోనియా

పేదరికం, అసమానతులు, వివక్ష నుంచి దేశానికి భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విముక్తి ప్రసాదించిందని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ప్రశంసించారు. దూరదృష్టి, దృఢ సంకల్పం, ప్రజల సంక్షేమం కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశ అభివృద్ధికి దోహదపడ్డాయని వెల్లడించారు. ప్రజలపై అపారమైన ప్రేమతో, అహింసపై అచంచల విశ్వాసంతో దేశాన్ని ముందుకు నడిపారని కొనియాడారు.