విషం తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య

విషం తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య

ప్రకాశం: తర్లుపాడు మండలం పోతలపాడు గ్రామంలో ఇవాళ  అప్పుల బాధతో విషం తాగి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పాతలపాడు గ్రామానికి చెందిన రాచకొండ కాశయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.