పోలీస్ గ్రీవెన్స్ డేలో ప్రజల ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ

NLG: పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ IPS పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 38 మంది ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, సంబంధిత అధికారులతో తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మరింత న్యాయం అందించే దిశగా పోలీసులు పని చేస్తున్నారని తెలిపారు. మధ్యవర్తుల ద్వారా కాకుండా, బాధితులే నేరుగా పోలీసులను కలవాలని సూచించారు.