సీఐటీయూ జెండా ఆవిష్కరణ
VSP: విశాఖలో ఈ నెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు 18వ సీఐటీయూ అఖిలభారత మహాసభలు జరగనున్నాయని సీఐటీయూ జోన్ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ తెలిపారు. మాధవధారలో గల మున్సిపల్ వార్డు ఆఫీస్ వద్ద కార్మికులతో కలిసి సోమవారం సీఐటీయూ జెండా ఆవిష్కరించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలను, లేబర్ కోడ్సు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.