'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

NDL: రైతులు జొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వెలుగోడు మండలంలోని రేగడగూడూరు గ్రామంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రబీ సీజన్‌లో సాగు చేసిన జొన్న పంట దిగుబడులను కొనుగోలు చేసేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.