గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
HNK: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీసీవో ఉమామహేశ్వరి తెలిపారు. విద్యార్థులు ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హతల ఆధారంగా ఎంపిక జరుగుతుందని చెప్పారు. ప్రవేశ పరీక్ష మే 13న నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.