పాక్ డ్రోన్ కలకలం.. భారత సైన్యం కాల్పులు
JKలోని LOC వెంబడి పాక్ మరోమారు కవ్వింపు చర్యలు చేపట్టింది. పూంచ్ జిల్లాలోని దిగ్వార్ సెక్టార్‌లోకి పాక్ డ్రోన్ ప్రవేశించింది. అప్రమత్తమైన భారత సైన్యం వెంటనే ఆ డ్రోన్‌ను నేలమట్టం చేసింది. దీనిని కూల్చివేసేందుకు 12 రౌండ్లకు పైగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. గత మూడు రోజులో ఇలాంటి ఘటన జరగటం ఇది రెండోసారి.