రైతులకు ఉద్యానశాఖ అధికారి సూచనలు

రైతులకు ఉద్యానశాఖ అధికారి సూచనలు

ప్రకాశం: గిద్దలూరు మండలం కే ఎస్.పల్లి గ్రామంలోని పలు పంటలను ఉద్యానశాఖ అధికారి శ్వేత గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు పంటల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తోట పంటలైన మామిడి, జామ, నిమ్మ, బొప్పాయి వంటి పంటల్లో నీటి నిర్వహణను సక్రమంగా చేపట్టాలని తెలిపారు. వేసవి తీవ్రత పెరుగుతున్నందున డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీటితో ఎక్కువ ప్రయోజనం పొందాలని సూచించారు.