తిరుమలగిరిలో రోడ్డు ప్రమాదం.... ఇద్దరు మృతి

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న ఇల్లును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే జనగాం నుండి వస్తున్న కారు అదుపుతప్పి పాత తిరుమలగిరి రోడ్డు ప్రక్కన ఉన్న ఇంటిని ఢీకొట్టడంతో కరీంనగర్ జిల్లాకు చెందిన రమేష్, విక్రమ్ వ్యక్తులు మరణించగా ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.