ట్రాఫిక్ పోలీసులకు కూల్ మిస్ట్ ఫ్యాన్
HYD: ఎండలతీవ్రత నుంచి ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించేందుకు HYD పోలీసులు 'మిస్ట్ ఫ్యాన్'ను అందుబాటులోకి తెస్తున్నారు. అసెంబ్లీ కూడలి వద్ద దీని డెమోను జాయింట్ CP జోయల్ డేవిస్ పరిశీలించారు. గంటలతరబడి ఎండలో విధులు నిర్వహించే సిబ్బందికి ఈఫ్యాన్ల ద్వారా చల్లనిగాలి, నీటి తుంపరలు లభించనున్నాయి. త్వరలోనే వీటిని నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.