ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: ఏపీటీఎఫ్
GNTR: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా సీపీఎస్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని జిల్లా అధ్యక్షుడు బసవలింగారావు అన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ శ్రీవాత్సవ్‌కు వినతి పత్రం అందజేశారు.