VIDEO: కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మాణ పనులు
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ అనేక వార్డులలో శరవేగంగా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. విఎంఆర్డిఏ ఫేజ్-1 నుంచి రూ.5 కోట్లు, ఫేజ్ - 2 నుంచి రూ. 4 కోట్ల రూపాయలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంజూరు చేయించారు. 15వ ఆర్థిక సంఘం నుంచి రూ. 15 కోట్లు నిధులతో రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు మున్సిపల్ డి.ఈ. కామేశ్వరరావు తెలిపారు.