పామర్రులో అగ్నిమాపక వారోత్సవాలు

కృష్ణా: పామర్రులోని ఆస్పత్రి వద్ద అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బుధవారం సిబ్బంది సాధారణ జాగ్రత్తలు, వంట ఇంటిలో జాగ్రత్తలు తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు. అలాగే గ్యాస్ లీకై మంటలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలను డెమో చేసి చూపించారు.