సబ్‌స్టేషన్‌లో కూలీకి విద్యుత్ షాక్
GNTR: ప్రత్తిపాడు సబ్‌స్టేషన్‌లో అధికారుల నిర్లక్ష్యంతో ఆదివారం ప్రమాదం జరిగింది. ఎల్సీ(LC) పొరపాటు వల్ల లైన్ పనులు చేస్తున్న బెంగాల్ కూలీ ఇమ్రాన్‌కు కరెంట్ షాక్ తగిలిందని స్థానికులు తెలిపారు. అతని చర్మం కాలిపోయి రెండు కాళ్లు విరిగాయి. తోటి కూలీలు వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.