'అమ్మవారి తిరువీధి ఉత్సవాలు వాయిదా'
PPM: తీవ్ర వాయుగుండం కారణంగా గురువారం జరగాల్సిన పాలకొండ కోట దుర్గ అమ్మవారి తిరువీధి ఉత్సవాలు వాయిదా పడ్డాయని ప్రధాన అర్చకులు ప్రసాద్ శర్మ తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా తిరువీధి ఉత్సవాలు భక్తులు వీక్షించడానికి అవకాశం లేనందున వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించారు. 5వ తేదీ ఆదివారం సాయంత్రం తిరువీధి మహోత్సవం నిర్వహిస్తామన్నారు.