‘అపరిమిత ఆయుధాలు ఉన్నాయి.. గెలుపు మనదే’

‘అపరిమిత ఆయుధాలు ఉన్నాయి.. గెలుపు మనదే’

అమెరికా వద్ద అపరిమిత ఆయుధ సంపత్తి ఉందని, తాము ఎప్పటికీ యుద్ధం చేస్తూనే ఉండగలమని అధ్యక్షుడు ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందిస్తూ.. అమెరికా కోసం ఉన్నత శ్రేణి ఆయుధాలను ఇతర దేశాల్లో కూడా నిల్వ చేసినట్లు వెల్లడించారు. తన తొలి విడత పాలనలోనే మిలిటరీని ఎంతో మెరుగుపర్చానని, అమెరికా సైనిక శక్తి ఇప్పుడు అత్యున్నత స్థాయిలో ఉందని ట్రంప్ పేర్కొన్నారు.