ఎస్సైకి సీఎం చేతుల మీదుగా ‘రియల్ హీరోస్’ పురస్కారం

ఎస్సైకి సీఎం చేతుల మీదుగా ‘రియల్ హీరోస్’ పురస్కారం

BDK: కొత్తగూడెం టాస్క్ ఫోర్స్‌లో సీసీఎస్ ఎస్సైగా పనిచేస్తున్న జలకం ప్రవీణ్‌కు ‘రియల్ హీరోస్’ అవార్డు లభించింది. హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. విధులలో చూపిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించడంతో జిల్లా పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.