తాగిన మైకంలో ఉరివేసుకుని వృద్ధుడు ఆత్మహత్య

తాగిన మైకంలో ఉరివేసుకుని వృద్ధుడు ఆత్మహత్య

ADB: ఉట్నూర్ మండలంలో రాథోడ్ సూర్సింగ్ (63) అనే వృద్ధుడు నిన్న రాత్రి మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ, అకస్మాత్తుగా కింద పడి తలకు గాయమైంది. ఆసుపత్రికి వెళ్లడానికి నిరాకరించి ఇంట్లోని గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.