BREAKING: గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతి

BREAKING: గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతి

HYD: గ్యాస్ సిలిండర్ పేలి ఓ మహిళ మృతి చెందిన ఘటన మధురానగర్‌‌లో చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో సోను బాయి(40) అనే మహిళ మృతి చెందగా, ఆమె తల్లిదండ్రులు గోపాల్ సింగ్, లలిత బాయికి స్వల్ప గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.