ప్రతి ఒక్కరూ సర్వేలో పాల్గొనాలి: కలెక్టర్
NRML: తెలంగాణ రైజింగ్ - 2047 సిటిజన్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ సర్వేను ప్రారంభించిందని, ఈ సర్వే అక్టోబర్ 25 వరకు కొనసాగనుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో తమ అభిప్రాయాలను పంచుకోవాలని సూచించారు.