మహిళ ప్రాణం తీసిన పిడుగు

SDPT: పిడుగుపాటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన బెజ్జంకిలో గురువారం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఎడ్ల బండి చౌరస్తా సమీపంలోని ఓ చింత చెట్టు సమీప ప్రాంతంలో పిడుగు పడగా.. అక్కడే ఉన్న టేకు రంగవ్వ(68) మృతి చెందిందని స్థానికులు తెలిపారు. మృతురాలికి భర్త శంకరయ్య, కుమారులు, కూతుర్లు ఉన్నారు.