మునగాల మండలంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు

SRPT: డెంగ్యూ, మరియు వైరల్ ఫీవర్ (జ్వరాలు) తగ్గుముఖం పట్టే వరకు కలకోవ గ్రామంలో హెల్త్ క్యాంప్ కొనసాగించాలని, రేపాల ప్రాథమిక వైద్య సిబ్బందిని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ ఆదేశించారు. మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఇటీవలే ఆరుగురికి డెంగ్యూ వ్యాధి వ్యాపించడంతో గ్రామంలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్‌ను శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.