పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
KRNL: చిప్పగిరి ప్రాథమిక పాఠశాలను ఇవాళ కలెక్టర్ సిరి ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి చదువు గురించి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణ, బాత్రూంలు అపరిశుభ్రంగా ఉండటం, పేరు బోర్డు లేకపోవడంతో ఉపాధ్యాయులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆకస్మిక తనిఖీ విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా జరిగిందని తెలిపారు.