VIDEO: బాలికల హాస్టల్‌లో విద్యార్థినుల ధర్నా
HNK: కాజీపేట మండలం మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల- కళాశాలలో మంగళవారం ఇంటర్ విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. హాస్టల్‌లోని ఉపాధ్యాయులు విద్యార్థులను వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రధానోపాధ్యాయులను తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే హాస్టల్ లో నెలకొన్న ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. నిరసన చేపట్టారు.