ప్రెస్ క్లబ్ డైరీలను ఆవిష్కరించిన కలెక్టర్
CTR: చిత్తూరు ప్రెస్ క్లబ్ డైరీలను కలెక్టర్ సుమిత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని ప్రశంసించారు. ఖచ్చితమైన సమాచారాన్ని అందించేలా జర్నలిస్టులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టు సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.