మరోసారి కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఆదేశాలు

మరోసారి కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఆదేశాలు

BDK: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా గ్రామ పంచాయతీ వార్డుల వారీ ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయాలని ఎస్ఈసీ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. గత నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి,కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించే శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఈ నెల 15 వరకు నమోదయ్యే గ్రామీణ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చాలని సూచించింది.