ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి తీవ్ర గాయాలు
విజయనగరం జిల్లా రామభద్రపురంలో ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన నెలకొంది. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు బొబ్బిలి నుంచి సాలూరుకు వెళ్తున్నట్లు తెలిసింది. స్థానికులు వెంటనే గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.