'2,500 హెక్టార్లలో వరి నాట్లు పూర్తి'

AKP: పాయకరావుపేట మండలంలో ఇప్పటివరకు 2,500 హెక్టార్లలో వరినాట్లు పూర్తయినట్లు మండల వ్యవసాయ అధికారి ఆదినారాయణ గురువారం తెలిపారు. వరి సాధారణ విస్తీర్ణం 2,630 హెక్టార్లుగా పేర్కొన్నారు. నాలుగైదు రోజుల్లో మిగిలిన హెక్టార్లలో వరినాట్లు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు మండలంలో 285 మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేసామని వెల్లడించారు.